సోమిరెడ్డి రాష్ట్ర పరిశీలకులు ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్
నవతెలంగాణ – గోవిందరావుపేట : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ రాష్ట్ర పరిశీలకులు సోమిరెడ్డి అన్నారు. మండలంలోని చల్వాయి మోడల్ పాఠశాలలో ఈనెల 20వ తేదీ నుండి నిర్వహించబడుతున్నటువంటి రెండవ దశ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్ర పరిశీలకులు తెలంగాణ ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి శిక్షణా తరగతులను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణార్ధులను ఉద్దేశించి సోమిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని 2025-26 విద్యా సంవత్సరంలో బడిబాట ద్వారా విద్యార్థుల నమోదును పెంచాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు మరియు సమాజానికి నమ్మకం పెంచడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులుగా మేము సిద్ధంగా ఉన్నామని, కావున తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని అన్నారు. విద్యా వ్యవస్థను ముఖ్యంగా ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుగా మనపై ఉందని ప్రతి ఒక్కరు గుర్తించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని మరియు కోర్స్ కోఆర్డినేటర్ కాటం మల్లారెడ్డి, సెంటర్ ఇన్చార్జిలు ఈ సూర్యనారాయణ, అర్షం రాజు, గుల్లపెల్లి సాంబయ్య, అప్పని జయదేవ్, మండల విద్యాశాఖ అధికారులు గొంది దివాకర్, రేగ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల బలోపేతంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES