Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

ఎస్టీయూటీఎస్‌ కార్యవర్గంలో
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నూతన మార్పులను తేవాలని కోరారు. అందరికీ నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని సూచించారు. సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ఎస్టీయూ పనిచేస్తోందని చెప్పారు. ఎస్టీయూటీఎస్‌ అధ్యక్షులు జి సదానందంగౌడ్‌, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపునివ్వాలని సూచించారు. ఇందుకోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, మెడికల్‌, సరెండర్‌ లీవు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వంటి బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలనీ, పీఆర్సీని అమలు చేయాలని కోరారు. సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి ఉపాధ్యాయులకు ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు పదోన్నతులను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్‌ ఆర్థిక కార్యదర్శి సాబేర్‌ అలీ, నాయకులు ఎవి సుధాకర్‌, ఎం ప్రసాద్‌, కరుణాకర్‌రెడ్డి, రంగారావు, రవీంద్ర, శీతల్‌ చౌహాన్‌, భార్గవి, అజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -