నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల తక్షణ పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉపాధ్యాయుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో భువనగిరి తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిటిఏఫ్ అధ్యక్షులు ఏన్ లక్ష్మీనరసింహారెడ్డి, యుటిఎఫ్ కార్యదర్శి జి రమణ రావు లు మాట్లాడుతూ విద్య ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 25న సవరించి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉండాలని కోరారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ రద్దుచేసి ఓపీఎస్లో పునరుద్ధరించాలని, 30 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయంలో అందజేస్తూ, పై సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యుఎస్పిసి నాయకులు పి సుదర్శన్ రెడ్డి, పి వెంకన్న, కే శ్రీశైలం, ఏ నాగేందర్, ఏం ఆంజనేయులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES