Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలు పిఆర్టియుతోనే పరిష్కారం 

ఉపాధ్యాయుల సమస్యలు పిఆర్టియుతోనే పరిష్కారం 

- Advertisement -

పిఆర్టియు టీఎస్ సంఘం సభ్యత్వ నమోదు
పి ఆర్ టి యు టి ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటే అది పి ఆర్ టి యు టి ఎస్ తోనే సాధ్యమవుతుందని పి ఆర్ టి యు టి ఎస్ మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి అన్నాడు. మండలంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాల నెల్లికుదురు, పిఎస్ మునిగలవేడు, జెడ్పిహెచ్ఎస్ నల్లికుదురు, పిఎస్ నెల్లికుదురు పి ఆర్ టి యు సభ్యత్వ కార్యక్రమాన్ని మంగళవారం ఆ సంఘం మండల అధ్యక్షుడు కార్యదర్శి కొత్త నరసింహారెడ్డి గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పిఆర్టియు సంఘం శాస్త్రీయ వైఖరి నీ కలిగి ఉంటుందని సమస్యలను పరిష్కరించి సాధించుటలో ఈ సంఘం ముందుంటుందని తెలిపారు. దేశంలోనే అధికంగా సభ్యత్వం కలిగిన ఉపాధ్యాయ సంఘం అది పి ఆర్ టి యు సంగం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగేందర్ రెడ్డి, సాయిలు, లక్ష్మణ్, జె శ్రీనివాస్, కాపు రాజేశ్వర్ రెడ్డి, సాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -