నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపిసి, ఎంపీసీ కోర్స్ సంబంధించిన బయోలాజికల్, బోటనీ, ఎంపీసీ, కెమిస్ట్రీ అధ్యాపకులను వెంటనే నియమించాలని టీజీవిపి జిల్లా అధ్యక్షులు సంజయ్ తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. అధ్యాపకులను నియమించాలని జిల్లా నోడల్ అధికారి సలాంకు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ సమీర్, మండల ప్రెసిడెంట్ భరత్, కార్తీక్, కళాశాల విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
అధ్యాపకులను వెంటనే నియమించాలి: టీజీవిపి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES