Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులు వేంకటేశ్వర్ రావును విధుల నుంచి తొలగించాలి..

ఉపాధ్యాయులు వేంకటేశ్వర్ రావును విధుల నుంచి తొలగించాలి..

- Advertisement -

డిఈఓను సస్పెండ్ చేయాలి
ప్రజా సంఘాల నాయకులు డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న పిన్నింటి వేంకటేశ్వర్ రావు గత మూడేళ్ళుగా పాఠశాలకు రాకుండా ప్రయివేటు రియల్ ఎస్టేట్, బిల్డర్ వ్యాపారాలు చూసుకుంటూ, ప్రభుత్వ సెలవుల్లో మాత్రమే వేతనం పొందుతున్న అతన్ని వెంటనే విధుల్లో నుంచి తొలగించి, అతనికి కొమ్ము కాస్తున్న జిల్లా డిఈఓను సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు పీక కిరణ్, అక్కల బాపు యాదవ్ లు గురువారం ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రభుత్వం చేపట్టిన మ్యాచువల్ ట్రాన్స్ పర్ లో భాగంగా 21, జూన్,2022లో జాయిన్ అయిన వేంకటేశ్వర్ రావు 2023 జూన్ 12 వరకు దాదాపు 28 నెలలుగా లాంగ్ లివ్ పెడుతున్నట్లుగా వాపోయారు. లాంగ్ లివ్ పెట్టడంతో ఆయన స్థానంలో వేరే ఉపాధ్యాయులను జాయిన్ కాకుండా వేకెన్సీ ఇవ్వకుండా చదువుల్లో విద్యార్థులకు నష్టం చేస్తున్నట్లుగా తెలిపారు. విధులకు డుమ్మా కొడుతున్న ఇతనిపై స్థానిక ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలు పలుమార్లు జిల్లా డిఈఓకు ఫిర్యాదు చెందిన పట్టించుకోకపోగా ఎలాంటి చర్యలు లేదని మండిపడ్డారు.

ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే ఇతనివద్ద నుంచి జిల్లా విద్యాధికారి మామూళ్లు తీసికొని చూసిచూడనట్లుగా చేయడం సరికాదన్నారు.అటు ప్రయివేటు వ్యాపారాలు చేసుకుంటూ, ఇటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వస్తున్న ఇతనికి జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు వతాస్తు పలకడంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి ఇలాకాలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం,అదికూడా మూడేళ్ళుగా విద్యాశాఖ నిద్రమత్తులో జోగడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అయిత బాపు. దయ్యం పోచయ్య పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img