Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల బోధన మెరుగుపర్చుకోవాలి...

ఉపాధ్యాయుల బోధన మెరుగుపర్చుకోవాలి…

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధ్యాయులు బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. మండలంలోని వళ్లెంకుంట జడ్.పి.హెచ్.ఎస్  పాఠశాలలో మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న మండల స్థాయి టీచర్ శిక్షణ శిబిరాన్నీ బుధవారం డిఈఓ సందర్శించి, తన యొక్క సందేశాన్ని ఇచ్చారు. ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యను అందించి భావి భారత పౌరులు గా తీర్చిదిద్దాలని సూచించారు.ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలి ఎంఈఓ లక్ష్మన్ బాబు  సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -