Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలువిద్యుత్తు ప్రమాదానికి గురైన విద్యార్థిని పరామర్శించిన ఉపాధ్యాయులు

విద్యుత్తు ప్రమాదానికి గురైన విద్యార్థిని పరామర్శించిన ఉపాధ్యాయులు

- Advertisement -

–  ఆర్థిక సాయం అందించిన ఉపాధ్యాయులు..
నవతెలంగాణ – జుక్కల్

బాలుడు పతంగులు ఎగిరేస్తుండగా పతంగి కరెంటు వైర్ కు చుట్టుకుంది. ఆ పతంగిని తీసుకొనే సమయంలో హైటెన్షన్ వైర్ కు చేయి తగిలి విద్యుత్ షాక్ తగిలి, చేతికి బలమైన గాయమైంది. ఈ ప్రమాదం డిసెంబర్ 21న చోటుచేసుకుంది. ఈ సంఘటన జుక్కల్ మండలంలోని కేంరాజ్ కల్లాలి గ్రామంలోని ప్రభుత్వ ఎంపియుపిఎస్ పాఠశాలలో ఆరవ తరగతిలో విద్యను అభ్యసిస్తున్న జున్ని వైష్ణవ్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బాలుడిని పరిశీలించి, ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు.. భవిష్యత్తులో విద్యార్థి క్షేమం కోసం వైష్ణవ్ ఎడమ చేయి తొలగించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్, స్వామి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం కేమ్రాజ్ కల్లాలికి వెళ్లి, విద్యార్థిని పరామర్శించారు. అదేవిధంగా తమవంతుగా రూ. 16 వేల నగదు ఆర్థిక సాయం బాలుడి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ నేపథ్యంలో హెచ్ఎం మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి వైష్ణవ్ ప్రమాదానికి గురి కావడం చాలా విచారకరంగా ఉందని ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్ అన్నారు.

సెలవు దినాలలో విద్యార్థులు ఇంటిపట్టున ఉండి సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం వలన జరిగిన నష్టం ఎవరు ఊహించలేనిదని అన్నారు. అందుకే అప్రమత్తంగా కుటుంబ పెద్దలతో కలిసి పతంగుల పండుగ రోజు ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంతోష్ , సంగమేశ్వర్, సునీల్ , సందీప్ , సంగ్రామ్ , భాస్కర్ రావు, గంగాయప్ప తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -