Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమయపాలన పాటించని ఉపాధ్యాయులు 

సమయపాలన పాటించని ఉపాధ్యాయులు 

- Advertisement -

గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన యువకులు 
నవతెలంగాణ- మిడ్జిల్ 

ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా పాఠశాలకు రాకపోవడంతో మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ స్థానికులు పాఠశాలకు తాళం వేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తోటి ఉపాధ్యాయుడి సోదరుని కూతురు ఎంగే జ్మెంట్ కోసం పాఠశాల ఉపాధ్యాయులు మొత్తం విధులకు డుమ్మా కొట్టి, విద్యార్థులను ఒంటరి చేసి ఎలా వెళ్తారని ఉపాధ్యాయులను నిలదీశారు.

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో జె డ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 21 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. ఓ ఉపాధ్యాయుని సోదరుని కూతురు ఎంగేజ్మెంట్ బుధవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఇందుకోసం పాఠశాలలోని ఉపాధ్యాయులు ఇద్దరు మినహా మొత్తం ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో పాల్గొనేందుకు గంప గుత్తగా తరలి వెళ్లారు. ఈ సమయంలో పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల స్థానికులు ఆగ్రహించి పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపారు.

నిబంధనల ప్రకారం మధ్యాహ్నం ఒకటి పది గంటలకు విధుల్లో చేరాల్సిన ఉపాధ్యాయులు రెండు గంటలు దాటితే కూడా విధులకు హాజరు కాలేక పోవడం విమర్శలకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు పాఠశాల వద్దకు వచ్చి స్థానికుల వద్దకు వెళ్లి నిరసన కారులను తప్పయింది.. క్షమించండి అని వేడుకున్నారు. ఈ పాఠశాల హెడ్మాస్టర్ గా ఉన్న ఉపాధ్యాయినీరాలు, ఇంచార్జ్, ఎంఈఓ గా పనిచేస్తుండడం పాఠశాల ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనంగా మారింది. పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు గాడిన పెట్టాల్సిన హెడ్మాస్టర్ ఇంచార్జ్ బాధ్యతలతో పాఠశాల స్థితిగతులను పట్టించుకోవడంలేదని పలువురు విమ ర్శిస్తున్నారు.

దీనిపై జిల్లా అధికారులు స్పందించి విధుల డుమ్మా కొట్టి కుటుంబ ఫంక్షన్ హాల్ లో జరిగిన విందులో ప్రత్యక్షమైన టీచర్లపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై జిల్లా విద్యాధికారి స్థానిక ఉపాధ్యాయుల పనితీరు పట్ల సీరియస్ అయినట్లు సమాచారం. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మిడ్జిల్ జెడ్ పి హెచ్ ఎస్ టీచర్లు డ్యూటీ లకు డుమ్మా కొట్టి ఫంక్షన్ హాల్ లో జరిగిన విందులో ప్రత్యక్షమయ్యారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు తాసిల్దార్ స్వప్న, గిర్దవారి అంబిక పాఠశాలకు వెళ్లి జరిగిన సంఘటనపైన వివరాలని తెలుసుకున్నారు. మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు ఇలా అందరూ ఒకేసారి డుమ్మ కొట్టి కొట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -