Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు..

క్రీడా దుస్తులు పంపిణీ చేసిన ఉపాధ్యాయులు..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట
బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠ శాలలో చేరుటకు ప్రోత్సాహకంగా క్రీడా దుస్తులు పంపిణి చేశామని ఉపాధ్యాయులు ముక్క రమేష్ అన్నారు. గురువారం మండలంలోని వెంకట్రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ విద్య సంవత్సరం నూతనంగా చేరిన 39 మంది విద్యా ర్థులకు అదే పాఠశాలలో పని చేస్తున్న ముక్క రమేష్ ఒక్కొకరికి ఒక జత క్రీడా దుస్తులు పంపిణి చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ చదు వు, క్రీడస్పూర్తి, దేశభక్తి, సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరుటకు ప్రోత్సాహకంగా ఉంటుందనే ఆలోచనతో క్రీడా దుస్థులు పంపిణి చేశామన్నారు. విద్యార్థులకు క్రీడా దుస్థులు పంపిణి చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

అనంతరం ప్రధా నోపాధ్యాయులు మాట్లాడుతూ గత సంవత్సరం తో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యా ర్థులు తమ పాఠశాలలో చేరారని హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రమేష్ హైదరాబాద్ లోని ఒరాకిల్ స్వచంద సంస్థ నుండి నలభై వేల రూపాయలను విరాళంగా సేకరించి విద్యార్థులుకు సహకారం అందిస్తున్నారని కొనియాడారు. గత సంవత్సరం రూ. 5 వేల విలువగల అటవస్థువు లను అందజేశారని, ఎన్ ఏం ఏం ఎస్ పరీక్షకు సంబంధించిన రూ. 3 వేల విలువగల స్టడీ మెటీరి యల్ ను అందజేశారని గుర్తుజేశారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న ఉపాధ్యాయులు పీడీ కనకయ్య, నారాయణ, సుధాకర్, శంకర్, ఎల్లయ్య, ఉపాధ్యా య బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -