Monday, August 18, 2025
E-PAPER
spot_img
HomeNewsఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు

ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : కాశ్మీర్ పర్యాటకులపై జరిగిన దాడికి నిరసనగా శనివారం ఎస్ ఎఫ్ ఎస్ స్కూల్లో సుభాష్ నగర్ నిజామాబాదులో తెలుగు పండితులు తెలుగు శిక్షణ తరగతుల్లో స్వల్పవిరమణ సమయంలో నిరసన తెలియజేశారు. ఆపరేషన్ సింధూరకి మద్దతుగా జాతీయ పతాకాన్ని పట్టుకొని నిలిచారు. కోర్సు డైరెక్టర్ శకుంతల పీజీహెచ్ఎం మాట్లాడుతూ.. పర్యాటరులపై దాడికి నిరసనగా ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధుర్ గొప్ప విజయం అన్నారు. ఇందులో ఆర్పీలు కాసార్ల నరేష్ రావు ,గంటల ప్రసాద్, చింతల శ్రీనివాస్, అజయ్ కుమార్ కే సి లింగం, నీలవేణి, సంధ్యారాణి, దస్తగిరి, పండిత పరిషత్ జిల్లా కార్యదర్శి కె.వి రమణాచారి, తపస్ అధ్యక్షురాలు కృష్ణవేణి, మొదలగు ఉపాద్యాయ సంఘాలు పండితులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతుగా నిలిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad