- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : పి ఆర్ టి యు టీఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హైదరాబాదులో నిర్వహిస్తున్న ధర్నాకు మండలం నుండి 60 మంది ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. సోమవారం మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ… ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నూతన పింఛన్ విధానం రద్దుచేసి పాత విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఓ పి ఎస్ ను పునరుద్ధరించే వరకు ఉద్యమం చేపడుతామని అన్నారు. తరలి వెళ్ళిన వారిలో మండల ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, రాష్ట్ర బాధ్యులు శ్రీనివాస్, విష్ణువర్ధన్, కృష్ణమోహన్, మాణిక్ రెడ్డి, భూమేష్, కన్నేరామ్, కృష్ణ ప్రసాద్, గంగరాజు, ప్రసన్న, స్వాతి, స్రవంతి, స్వరూప తదితరులు తరలి వెళ్లారు.
- Advertisement -