నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి బోధనాభ్యాసన సామాగ్రి (టి ఎల్ ఎం) మేళా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరై, ఉపాధ్యాయులు తయారు చేసిన వినూత్న బోధనా పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “విద్యా నాణ్యతను పెంచి, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన చేయడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యం. వినూత్న బోధనా పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి పెరుగుతుంది.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోంది” అని పేర్కొన్నారు. ఈ మేళాలో ఉపాధ్యాయులు సృజనాత్మకంగా రూపొందించిన వివిధ రకాల బోధన పరికరాలు ప్రదర్శించబడ్డాయి. ఇవి విద్యార్థుల అభ్యాసన ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు పాఠాలపై ఆసక్తిని కలిగించే విధంగా ఉన్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ, హెచ్ఎంలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యా నాణ్యత పెంపుకు బోధనాభ్యాసన సామాగ్రి మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES