Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సకల వసతులతో రాయపోల్ హైస్కూల్ లో బోధన

సకల వసతులతో రాయపోల్ హైస్కూల్ లో బోధన

- Advertisement -

మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ- రాయపోల్ 

ఇంటర్నేషనల్, కార్పోరేట్ పాఠశాలలు దీటుగా సకల సౌకర్యాలతో రాయపోల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుందని మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విఆర్ హెడ్ సెట్ స్టూడియో, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దృష్టి సారించాయని దానిలో భాగంగానే రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిఎఫ్ శ్రీ పాఠశాలగా ఎంపికైందన్నారు.

పీఎం శ్రీ పాఠశాలలో ఇంటర్నేషనల్ పాఠశాల స్థాయికి  ఏ మాత్రం తగ్గకుండా పాఠశాలలో వి.ఆర్ హెడ్ సెట్ స్టూడియో, కంప్యూటర్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ , అటల్ థింకరింగ్ ల్యాబ్, అధునాతన గ్రంధాలయం, ఐఐటీ మద్రాస్ యూనివర్సిటీ అనుసంధానంతో ఆన్లైన్ తరగతులు, విశాలమైన క్రీడా ప్రాంగణం, ఉచిత మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ బడులలో విద్యార్థులను చదివించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad