Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బోధన గోడల మధ్యనే కాకుండా ప్రకృతిలో కూడా ఉండాలి

బోధన గోడల మధ్యనే కాకుండా ప్రకృతిలో కూడా ఉండాలి

- Advertisement -
  • – షైన్ పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్
  • – విద్యార్థులతో కలిసి రోబో సాండ్ యూనిట్ సందర్శన
  • నవతెలంగాణ-భూపాలపల్లి
    బోధన గోడల మధ్యనే కాకుండా ప్రకృతిలో కూడా ఉండాలని భూపాలపల్లి షైన్ పాఠశాల కరస్పాండెంట్ భానుచందర్ తెలిపారు. పారిశ్రామిక పర్యటనలో భాగంగా హనుమకొండ జిల్లా పరకాలకు సమీపంలో ఉన్న మాందారిపేటలోని బాలాజీ రోబో సాండ్ యూనిట్‌ను భూపాలపల్లి పట్టణ కేంద్రానికి చెందిన షైన్ పాఠశాల విద్యార్ధుల తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రోబో ఇసుక ఉత్పత్తి, అనుమతులు, పర్యావరణ సమస్యలు, మూలధనం, ఆదాయం, విధానం గురించి విద్యార్థులు యూనిట్ మేనేజర్‌ ను ప్రశ్నలు అడిగారు. మేనేజర్  ప్రదీప్ పిల్లలకు స్పష్టంగా సమాధానం ఇచ్చారు. 
  • సందేహాలను పరిష్కరించారు. ఈ సందర్భంగా  కరస్పాండెంట్ భానుచందర్ మాట్లాడుతూ… విద్యావ్యవస్థను తప్పనిసరిగా మార్చాలన్నారు. విద్యార్థులలో వినూత్న ఆలోచనలు ఉండాలని, అందుకే ప్రాంతాలను పరిశీలిస్తూ బోధన  అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఎం. కుమార్ యాదవ్, ప్రిన్సిపాల్ ఎ, స్రవంతి, ఉపాధ్యాయులు రాజేష్, అశోక్, గోపికృష్ణ, మలన్, విద్యార్థులు పాల్గొన్నారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -