Thursday, September 11, 2025
E-PAPER
Homeఖమ్మంవృత్యంతర శిక్షణతో బోధనలో మెలుకువలు 

వృత్యంతర శిక్షణతో బోధనలో మెలుకువలు 

- Advertisement -

– ఎంఈఓ ప్రసాదరావు
– పాఠశాలల శిధిల భవనాలు పరిశీలించిన  టీజీఈడబ్ల్యుఐడీసీ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

వృత్యంత శిక్షణతో ఉపాధ్యాయుల్లో బోధనా సామర్ధ్యం మెరుగుపడుతుందని ఎంఈఓ ప్రసాదరావు అన్నారు. ఉపాధ్యాయులకు రెండు రోజులు పాటు సబ్జెక్టులు పై నిర్వహించే శిక్షణా తరగతులను ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మండలంలో కూలడానికి సిద్ధంగా ఉన్న పాఠశాల భవనాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల మేరకు టీజీఈడబ్ల్యుఐడీసీ ( తెలంగాణ విద్యా సంక్షేమ నిర్మాణాల అభివృద్ది కార్పోరేషన్ ) డీఈ బుగ్గయ్య,ఏఈ రాంకుమార్ తో పరిశీలించారు.కొత్తూరు, కుడుములపాడు,గంగారం, గుర్రాల చెరువు పాఠశాలలను సందర్శించి పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న పాత భవనాలను కూల్చడానికి సిఫార్సు చేశారు.యూపీఎస్ కొత్తూరు పాఠశాల భవనానికి మరమ్మత్తులు సూచించారు. విద్యార్థులకు ప్రమాదకరం గా ఉన్న భవనాలను తొలగించాల్సిందిగా సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -