- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండలంలోని దేవునిగూడకు చెందిన గవ్వల మురళి ఇంట్లో రూ.30 వేల విలువ చేసి టేకు కలపను, కోత మిషన్ ను బుధవారం పట్టుకున్నట్లు జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. స్థానిక ఎల్డీఓ రామ్మోహన్ కు అందిన సమాచారం మేరకు తనతో పాటు ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు విజయ్,కుమార్ స్వామి, ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు రవి,మధుక “ర్, పురుషోత్తం, తన్వీర్ పాషా, లవర్ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది అక్కడికి వెళ్లి నిందితున్ని అదుపులోకి తీసుకొని, 4టేకు కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. కలపను జన్నారం కలప డిపోకు తరలించినట్లు ఆయన వెల్లడించారు.
- Advertisement -



