నవతెలంగాణ – హైదరాబాద్; టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా, టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఈ విజయంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ భారత జట్టును ప్రశంసించాడు. “పవర్‌ప్లేలోనే భారత్ మ్యాచ్‌ను పాకిస్థాన్ నుంచి లాగేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్, రెండో ఇన్నింగ్స్‌లో మన బౌలర్ల అద్భుత ప్రదర్శన మ్యాచ్‌లో తేడాను చూపాయి. భారత్ అదరగొట్టింది” అని సచిన్ ‘X’లో పోస్ట్ చేశాడు.
టీమిండియా పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను లాగేసింది: సచిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



