Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు, డీలర్లకు సాంకేతిక సమస్య 

రైతులకు, డీలర్లకు సాంకేతిక సమస్య 

- Advertisement -

సర్వర్ సమస్యతో ఇబ్బందులు 
యూరియా కోసం తప్పని తిప్పలు 
బుక్ చేసుకోవడానికి రైతులకు, ఐడీలు నిర్ధారించడానికి డీలర్లకు తప్పని సమస్య 
నవతెలంగాణ – పాలకుర్తి

ఆన్లైన్లో యూరియా బుకింగ్ రైతులకు, డీలర్లకు సాంకేతిక సమస్య వెంటాడుతూనే ఉంది. మొక్కజొన్న, వరి పంటలు సాగు చేసుకున్న రైతులు సమయానికి యూరియా అందించాల్సి ఉంటుంది. యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో సాంకేతిక లోపం వల్ల రైతులకు ఆన్లైన్ బుకింగ్ విధానం శాపంగా మారింది. యూరియా కోసం రైతులు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలన్న, బుకింగ్ చేసుకున్న రైతుల ఐడిని నిర్ధారించాలన్న అటు రైతులకు, ఇటు డీలర్లకు సాంకేతిక సమస్యతో ఇబ్బందులు తప్పడం లేదు. సర్వర్ సమస్య ఏర్పడడంతో ఆన్లైన్లో యూరియా బుకింగ్ చేసుకున్న రైతులు గంటల తరబడి యూరియా కోసం ఎదురుచూడాల్సిందే.

రైతులకు ఆన్లైన్ బుకింగ్ విధానంతో యూరియాను అందించాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐ సి పైలట్ ప్రాజెక్టులో భాగంగా జనగామ జిల్లాను ఎంపిక చేసి యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానానికి దిశా నిర్దేశం చేసింది. ఆన్లైన్ బుకింగ్ విధానంలో రైతులు డీలర్ల వివరాలను నమోదు చేయడంతో ఆన్లైన్లో యూరియా బుకింగ్ చేసుకున్నట్లు రైతులకు ఐడిని కేటాయిస్తారు. సర్వర్ ఇబ్బందులతో సాంకేతిక సమస్య ఏర్పడడం వల్ల యూరియాను ఏ షాపులో బుకింగ్ చేసుకున్నారనే ఐడిని నిర్ధారించుకునేందుకు రైతులకు భారంగా మారింది.

సాంకేతిక సమస్య ఏర్పడడంతో శనివారం మండలంలోని డీలర్ల వద్ద రైతులు బారులు తీరారు. రైతుల ఐడిని నిర్ధారించుకునేందుకు సాంకేతిక సమస్య ఆటంకి గా మారింది. సాంకేతిక సమస్య ఏర్పడడంతో రైతులు ఆన్లైన్లో యూరియాను బుకింగ్ చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించి రైతులకు, డీలర్లకు ఎలాంటి సాంకేతిక సమస్య ఏర్పడకుండా ఎన్ఐసి పైలెట్ ప్రాజెక్టులో నివారణ చర్యలు చేపట్టి రైతులకు ఆన్లైన్ బుకింగ్ ద్వారా సకాలంలో యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుచున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -