Sunday, January 11, 2026
E-PAPER
Homeబీజినెస్త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు టెక్నో పెయింట్స్‌..!

త్వరలో పబ్లిక్‌ ఇష్యూకు టెక్నో పెయింట్స్‌..!

- Advertisement -

రూ.500 కోట్ల సమీకరణ లక్ష్యం
ప్రచారకర్తగా సచిన్‌ నియామకం
ఆ కంపెనీ చైర్మెన్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి


నవతెలంగాణ – హైదరాబాద్‌
పెయింట్స్‌ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్‌ అండ్‌ కెమికల్స్‌ భారీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా పబ్లిక్‌ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. అదే విధంగా కంపెనీ గ్లోబల్‌ గుర్తింపున కోసం ప్రముఖ క్రెకెటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను బ్రాండ్‌ అంబాసీడర్‌గా నియమించుకుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకూరి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. సచిన్‌ తమ సంస్థకు మూడేండ్లు పాటు ప్రచారకర్తగా కొనసాగనున్నారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27లో రూ.500 కోట్ల నిధుల సమీకరణ కోసం ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు రానున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రతిపాదిత పత్రాలను సెబీకి సమర్పించనున్నామని చెప్పారు.

గడిచిన 2024-25లో తమ సంస్థ రూ.210 కోట్ల రెవెన్యూ సాధించిందన్నారు.ప్రస్తుత 2025-26లో రూ.450 కోట్ల టర్నోవర్‌ అంచనా వేస్తోన్నామన్నారు. 2029-30 నాటికి రూ.2,000 కోట్ల రెవెన్యూను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఒడిషా, చండీగఢ్‌లో కార్యకలాపాలను కలిగి ఉన్నామని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2026-27లో మధ్యప్రాచ్య దేశాల్లో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం 175 పెయింటింగ్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణలో 26,065 పాఠశాలలకు పెయింటింగ్‌ పనులు ప్రారంభం అయ్యాయని చెప్పారు. 5వేల మందికిపైగా నిపుణులైన పెయింటర్లకు తమ సంస్థ ఉపాధిని కల్పిస్తోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -