Tuesday, July 1, 2025
E-PAPER
Homeఆటలుస్పోర్ట్స్‌లో సాంకేతికత వాడాలి

స్పోర్ట్స్‌లో సాంకేతికత వాడాలి

- Advertisement -

సమీక్ష సమావేశంలోక్రీడాశాఖ మంత్రి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : రాష్ట్రంలో క్రీడాభివృద్దికి సాంకేతికతను వాడుకోవాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో క్రీడలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘క్రీడల అభివృద్దికి సాంకేతికత పరిజ్ఞానం జోడించాలి. రాష్ట్రంలో ప్రతి అథ్లెట్‌ సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేసి, డేటా బ్యాంక్‌లో నిక్షిప్తం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేలా క్రీడా ప్రాధికార సంస్థ కార్యక్రమాలు ఉండాలి. అధికారులు మొక్కుబడిగా కాకుండా.. చిత్తశుద్దితో పని చేయాలని’ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. శాట్జ్‌ చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి, వీసీఎండీ సోని బాలాదేవి, డిప్యూటీ డైరెక్టర్లు, అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -