Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ఆదర్శం 

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ఆదర్శం 

- Advertisement -

పాలకుర్తి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మంజుల 
నవతెలంగాణ – పాలకుర్తి

గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు తీజ్ వేడుకలు ఆదర్శం అని ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం మండలంలోని పెద్దతండ (కె), మేకల తండా, నార బోయిన గూడెం గ్రామపంచాయతీ శివారు నలిగాని తండా లతోపాటు మండలంలోని పలు తండాల్లో తేజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తీజ్ వేడుకల్లో భాగంగా పెద్దతండ కే లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు లతో కలిసి మంజుల తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ పది రోజులు భక్తిశ్రద్ధలతో  సాంప్రదాయ బద్దంగా గిరిజనులు పెళ్లి కానీ అమ్మాయిలతో తీజ్ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి సొసైటీ మాజీ చైర్మన్ వీరమనేని యాకాంతరావు, జిల్లా నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, సేవాదళ్ రాష్ట్ర నాయకులు గుగ్గిళ్ళ ఆదినారాయణ, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లావుడియా భాస్కర్ నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గాదెపాక భాస్కర్, మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్, నాయకులు గుగులోతు లచ్చిరాం నాయక్, లావుడియా బాలాజీ, బానోతు రవి నాయక్, లాకావత్ రవి నాయక్, భూక్య మల్లేష్ నాయక్ లతోపాటు ఆయా తండాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img