Monday, July 14, 2025
E-PAPER
Homeజిల్లాలుఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరికాదు 

ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సరికాదు 

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు కరిపే రాజు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: బీసీల రిజర్వేషన్ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చింతపండు నవీన్ అలియాస్ (తీన్మార్ మల్లన్న) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుడు కరిపే రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం కల్వకుంట్ల కవిత తెలంగాణలోని జిల్లాలలో బీసీసదస్సులు, ధర్నాలు, దీక్షలు చేపడుతూ, ఢిల్లీలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినా సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో 42 శాతం రిజర్వేషన్ లకు కట్టుబడి ఉన్నాం అని చెప్పి ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపారని అన్నారు.

ఈ సందర్భం గా జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటే ఆ సంబరాలను పురస్కరించుకొని తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా, ఒక జర్నలిస్టుగా ఉంటూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ మహిళ లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న ఎమ్మెల్సీగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఇంతటి దిగజారుడు, నీచమైన మాటలను బహిరంగ సభలలో మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిని పాడు చేస్తూ కవిత గౌరవాన్ని భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అడిగెందుకు వెళ్లిన జాగృతి నాయకులను భౌతికంగా దాడి చేయడమే కాకుండా కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -