- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
ఐకెపి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు సందర్శించారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మెయింటైన్ చేస్తున్న రికార్డులను పరిశీలించారు. కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని,రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రైవేట్ గా అమ్ముకొని నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అద్దంకి వెంకట్,మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ,ఐకెపి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



