- Advertisement -
నవతెలంగాణ -ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ మండల తహశీల్దార్ శ్రీలత ఉత్తమ ఉధ్యోగ అవార్డు ను శుక్రవారం అందుకున్నారు. ఆగస్టు 15 స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా విధి నిర్వహణలో సక్రమంగా నిర్వహించి , ప్రజల మన్ననలు పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ వస్తుంది. అయితే నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా తహశీల్దార్ ఉత్తమ ఉద్యోగ అవార్డును అందుకున్నారు. దీంతో తహసిల్దార్ కు నాయబ్ తహశీల్దార్ తెలంగ్ రావ్,ఆర్ ఐ లు నారాయణ రావు పటేల్, సరస్వతి ,వివిధ పార్టీల నాయకులు, అధికారులు, జర్నలిస్టులు, తో పాటు తదితరులు అభినందనలు తెలిపారు.
- Advertisement -