Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeట్రెండింగ్ న్యూస్తేజ సజ్జ “మిరాయ్” ట్రైలర్ వచ్చేసింది…

తేజ సజ్జ “మిరాయ్” ట్రైలర్ వచ్చేసింది…

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం “మిరాయ్”. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన విడుదల కాబోతున్నట్టుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఇందులో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా రితిక నాయక్ నటిస్తోంది.

ఈ సినిమాను ఫాంటసీ డ్రామా యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. కాగా “మిరాయ్” సినిమా దాదాపు ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హీరో తేజ ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలని తన అభిమానులు ఎదురుచూస్తున్నారు. తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హీరో స్థాయికి ఎదిగారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరోగా నటించి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. తను నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడు “మిరాయ్” సినిమా కూడా సక్సెస్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad