నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్య లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు వారు వెల్లడించారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి.శ్యామ్‌ను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. ఉద్యోగ విరమణపొందిన ప్రధానకార్యదర్శి ఎ.సత్యనారాయణ ను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించారు. వారిరువురికి సీఎం అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో జేఏసీ నాయకులు ముజీబ్ హుస్సేన్, ఎ. సత్యనారాయణ తదితరులున్నారు.
సీఎంకు టీఈజేఏసీ నేతల శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



