– టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి టెక్రియాల్ గ్రామంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టేక్రియాల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తల కుటుంబాలను శనివారం పరామర్శించారు. టేక్రియాల్ గ్రామానికి చెందిన, నందివాడ సాయిలు, సుంకరి నడిపి సాయిలు, రాయల సాయి, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న చెవిటి భాస్కర్ వారి వారి ఇండ్లకు వెళ్లి పరామర్శించి ఐదు కుటుంబాలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సుంకరి బిందు, భావన కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, జాదవ్ శంకర్ రావు, ఊరుదొండ వనిత రవి, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, పిడుగు సాయిబాబా, సలీం, చాట్ల వంశీ, మామిళ్ళ రమేష్, రవి పటేల్, రంగ రమేష్, బండారి శ్రీకాంత్, బల్ల శ్రీనివాస్, కిరణ్, ఆబిద్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
టెక్రియాల్ సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



