Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాములమ్మకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ఉద్యమ కారులు 

రాములమ్మకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ ఉద్యమ కారులు 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మానిఫేస్టోలో ఇచ్చిన హామీల అమలుపై శాసనమండలిలో ప్రస్తావించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రాములమ్మ, విజయశాంతికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భూపాలపల్లి జిల్లా నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మంగళవారం మండల కేంద్రమైన తాడిచర్ల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హమీలు అమలు చేయకపోవడం సరికాదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఉద్యమకారుల హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి ఆర్థికంగా, శారీరకంగా నష్ట పోయి అనేక ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు ఎమ్మెల్సీ విజయశాంతికి ఉద్యమకారుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలోజు సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు యాదండ్ల గట్టయ్య యాదవ్, జిల్లా ప్రదాన కార్యదర్శి ముడితనపెల్లి ప్రభాకర్, మండల అధ్యక్షులు బూడిద సతీష్, ఉద్యమ కారులు చొప్పరి రాజు, షేక్ చాంద్ పాష, కోండ్ర సారయ్య, వెంకటస్వామి, జునగరి పద్మ,మద్దుల విజయ, ఆకుల సదానందం, రాజేశం గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -