- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఉద్యమ జేఏసీ నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అభయహస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైనవారికి 8 వారాల లోపు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.
- Advertisement -



