నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమాలు మరింతగా ఉధృతం చేస్తామని మద్నూర్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు తూమ్ హనుమాన్లు తెలిపారు. హైదరాబాదులోని జయశంకర్ అల్వాల్ లో చేపట్టే రిలే నిరాహార దీక్ష ఆందోళన కార్యక్రమానికి మద్నూర్ మండల ఉద్యమకారులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాదుకు తరలి వెళ్లిన వారిలో తూమ్ హనుమాన్లు, మాలే శివరాం, వట్నాల గంగారాం, పాకల విటల్, పైడాకుల అంజయ్య, ఉన్నారు.
చలో హైదరాబాద్ కు తరలిన తెలంగాణ ఉద్యమకారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



