నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో సోమవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల స్థూపానికి పూలు చల్లి నివాళులర్పించారు. సందర్భంగా సీపీఐ(ఎం) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి మాట్లాడుతూ..తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగినదన్నారు. ఆ పోరాటంలో స్త్రీలు పురుషులు సమానంగా పోరాటం చేశారని, కుల మతాలకతీతంగా అనిచివేతకు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అప్పటి భూస్వాముల, జాగీర్దార్ల భూములు తీసుకొని 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన ప్రజలకు పంచడం జరిగిందని వివరించారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎటువంటి సంబంధం లేని బిజెపి,ఆర్ ఎస్ ఎస్ చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల వివాదంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పోరాటాలపై తప్పుడు వక్రీకరణలు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కే అశోక్, మండల నాయకులు కే లింగన్న, కె బుచ్చయ్య, ఎం జయ, ఏ లక్ష్మణ్,డి రాజన్న, ఎస్కే అబ్దుల్లా, యశోద,జి రాజన్న, సువర్ణ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
జన్నారంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES