మూడేళ్లలో 40 శాతం ఇక్కడే ఏర్పాటు
ఎక్స్‌ఫెనో సీఈఒ పడమదన్ వెల్లడి
నవతెలంగాణ – హైదరాబాద్
గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లను ఆకర్షించడంతో తెలంగాణ టాప్‌లో ఉందని ఎక్స్‌ఫెనో నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో దేశ వ్యాప్తంగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ జిసిసిలో 40 శాతం తెలంగాణలో ఏర్పాటు చేయబడ్డాయని తెలిపింది. జీసీసీలు అనేవి బహుళజాతి సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే ఆఫ్‌షోర్ యూనిట్లు. ఇవి ఐటి సేవలు, ఫైనాన్స్, హెచ్‌ఆర్, డేటా అనలిటిక్స్, ఆర్‌అండ్‌డి, కస్టమర్ సపోర్ట్ వంటి వివిధ విభాగాలకు సంబంధించిన సేవలను అందిస్తాయి. జిసిసి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతోందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఎక్స్‌ఫెనో సీఈఒ ఫ్రాన్సిస్ పడమదన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ 40 శాతం జీసీసీలను ఆకర్షించగా.. తర్వాత స్థానంలో బెంగళూరు 33 శాతం వాటాను కలిగి ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కేంద్రంగా వేగంగా ఎదుగుతోందన్నారు. అధిక నాణ్యత కలిగిన ప్రతిభా వంతులు, వలస ధోరణులు ఇందుకు ప్రధాన మద్దతును అందిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 360కి పైగా జిసిసిలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 3.1 లక్షలకుపైగా నిపుణులు పని చేస్తున్నా రన్నారు. ఇది రాష్ట్రంలోని మొత్తం వైట్ కాలర్ వర్క్ ఫోర్స్‌లో 14 శాతం కంటే ఎక్కువని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరంథ్ తెలిపారు. ఇక్కడ ప్రతిభా వంతుల ప్రవాహం, లీడర్‌షిప్, వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిసిసి మొత్తం ఉద్యోగాల్లో ఇంజినీరింగ్, ఐటి రోల్స్ 57 శాతం వాటాను కలిగి ఉన్నాయన్నారు.
జీసీసీల గమ్యస్థానంగా తెలంగాణ
- Advertisement -
- Advertisement -