ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణను దేశంలోనే ప్రముఖ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఇండియా స్కిల్ పోటీలను సందర్శించి, విద్యార్థుల సాంకేతిక ప్రతిభను, వృత్తిపర నైపుణ్యాలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్కిల్ సంస్థలతో భాగస్వామ్యాలను బలోపేతం చేస్తూ, ఉన్నత విద్యను పరిశ్రమ ఆధారిత నైపుణ్య వ్యవస్థలతో అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌ఎస్డీసీ ముఖ్య కార్య నిర్వాహణ అధికారి అరుణ్ కుమార్ పిళ్లైతో సమావేశమై తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య కార్యక్రమాలను విస్తరించే అంశంపై చర్చించారు.



