No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeప్రధాన వార్తలులైఫ్‌ సైన్సెస్‌ - మెడికల్‌ హబ్‌గా తెలంగాణ

లైఫ్‌ సైన్సెస్‌ – మెడికల్‌ హబ్‌గా తెలంగాణ

- Advertisement -

తయారీ రంగం ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
ప్రకృతి ఉత్తమ గురువు..నేర్చుకోవాలిగానీ తప్పుచేయొద్దు : బయోడిజైన్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌-2025 సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ హబ్‌గా తెలంగాణ నిలిచిందనీ, ఇప్పుడు తయారీ రంగం ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో జరిగిన బయోడిజైన్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌(ఆసియా-పసిఫిక్‌)-2025లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… బయోడిజైన్‌ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మనం రూపొందించే దేనిలోనైనా ప్రయోజనం, పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయనీ, దేవుడు గొప్ప డిజైనర్‌..ప్రకృతి ఉత్తమ గురువు అని చెప్పారు. ప్రకృతి నుంచి నేర్చుకోవాలిగానీ తప్పులు చేయొద్దని సూచించారు. కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రైజింగ్‌-2047లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ కు కేంద్రంగా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్‌ కీలకమైనవని తెలిపారు. ఫార్మా, బయోటెక్‌, లైఫ్‌ సైన్సెస్‌ , మెడ్‌టెక్‌ వంటివి హైదరాబాద్‌ లో అత్యంత కీలకమైనన్నారు. తయారీ రంగం నుంచి ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను మారుస్తున్నామని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో 302 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామనీ, అందులో పరిశోధన, పరీక్ష, తయారీ కోసం ఉత్తమ మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని వివరించారు. అక్కడ 60కి పైగా దేశీయ, అంతర్జాయతీయ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. డయాగస్టిక్‌ పరికరాలు, ఇమేజింగ్‌ టెక్నాలజీలు, ఇంప్లాంట్లు, శస్త్రచికిత్స పరికరాలు, డిజిటల్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. స్థానిక స్టార్టప్‌లు, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు గ్లోబల్‌ కంపెనీలతో పాటు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం పరిశోధనలు నిర్వహిస్తున్న డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, ఏఐజీ ఆస్పత్రి బృందాన్ని అభినందించారు. డేటా గోప్యతను పాటిస్తూనే ఇక్కడ ప్రజల వైద్యసహాయం కోసం అవసరమైన డేటాను అందజేస్తామని ప్రకటించారు. స్కిల్‌ యూనివర్సిటీ, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు, రీసెర్చ్‌ సెంటర్లతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయనీ, పన్నులు, యుద్ధాలు,వాణిజ్యపరమైన అడ్డంకులు వంటివి ఎదురవుతున్నాయని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad