Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలాజిస్టిక్‌ హబ్‌గా తెలంగాణ

లాజిస్టిక్‌ హబ్‌గా తెలంగాణ

- Advertisement -

‘ఫ్యూచర్‌ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు : ‘ట్రాన్స్‌పోర్ట్‌ లాజిస్టిక్‌ ఇండియా-2026’ సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

తెలంగాణను దేశంలోని అగ్రశ్రేణి లాజిస్టిక్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమనీ, దానికోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్‌ ఇంటిగ్రేషన్‌, పాలసీ అండ్‌ రెగ్యులేటరీ ఫెసిలిటేషన్‌, సుస్థిరాభివృద్ధి, గ్రీన్‌ లాజిస్టిక్స్‌, నైపుణ్యాభివృద్ధి ఆవిష్కరణలతో ‘ఫ్యూచర్‌ రెడీ ఎకో సిస్టం’ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మెస్సే ముంచెన్‌ ఇండియా(జర్మనీ అనుబంధ సంస్థ)’ నిర్వహిస్తోన్న ‘ట్రాన్స్‌పోర్ట్‌ లాజిస్టిక్‌ ఇండియా-2026’ సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కీలక రంగాల్లో ప్రధానమైన ‘లాజిస్టిక్‌ రంగం’ అనీ, దాని అభివృద్ధి కోసం భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందించామని వివరించారు. 2047 నాటికి తెలంగాణను తిరుగులేని శక్తిగా మారుస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసుల పునర్నిర్మాణం, ఏఐ ఆధారిత ఇంటెలిజెంట్‌ లాజిస్టిక్స్‌, సస్టైనబిలిటీ అనే మూడు ప్రధాన మార్పులు లాజిస్టిక్స్‌ రంగాన్ని సమూలంగా మార్చేస్తున్నాయన్నారు. భౌగోళికంగా రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను ‘డిజైన్‌ అడ్వాంటేజ్‌’గా మార్చుకుంటున్నామన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో ఫేజ్‌ -2, కొత్త ఎయిర్‌ పోర్టులు, డ్రై పోర్టు, తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీ 2.0, లాజిస్టిక్‌ హబ్స్‌ తదితర ప్రాజెక్టులు ఈ రంగంలో రాష్ట్రాన్ని అంతర్జాతీయస్థాయి కేంద్రంగా మారుస్తాయని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -