నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించింది.
అనంతరం తెలంగాణ ప్రయివేటు యూనివర్సిటీల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, పురపాలక సంఘాల సవరణ బిల్లు, టీఎస్‌ఎస్ ఆడిట్ నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ వార్షిక నివేదికను మంత్రి భట్టివిక్రమార్క, నిజాం షుగర్స్ లిమిటెడ్ వార్షిక నివేదికలు, ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ నివేదికలను మంత్రి శ్రీధర్ బాబు, అటవీ అభివృద్ధి సంస్థ వార్షిక నివేదికను మంత్రి కొండా సురేఖ, కాళేశ్వరం కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ ముందు ఉంచుతారు.