- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 16 నుండి 30 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 16న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశాల్లో.. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఉంటుంది. మార్చి 19న ఉగాది సెలవు ప్రకటించారు. మార్చి 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 23 నుండి వివిధ శాఖల పద్దులపై చర్చలు జరిపి, మార్చి 30న బడ్జెట్ ఆమోదం అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.
- Advertisement -



