Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ బడ్జెట్.. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు

తెలంగాణ బడ్జెట్.. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ బడ్జెట్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు, అందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. 18 ఏళ్లు పైబడిన, 61 ఏళ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రకటనతో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -