నవతెలంగాణ – భువనగిరి
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా భారతదేశంలోని ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న కేరళ వామపక్ష ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. కేరళ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఖండిస్తూ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ విలువలు తప్పి మాట్లాడుతున్నారని, మతోన్మాద భావాజాలాన్ని పెంచి పోషిస్తున్న బిజెపిని నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ దేశంలోనే ఉత్తమ పాలన అందిస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని అంటగడుతూ మాట్లాడడం పూర్తిగా అసంబద్ధమని వారు అన్నారు. కమ్యూనిస్టులతో పెట్టుకుంటే మీ మనవడకే ప్రమాదం అని వారు అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ లోపాయకర పొత్తులు పెట్టుకొని పోటీ చేసిన విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీ లోపాయకార ఒప్పందాలు కుదుర్చుకొని పనిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి కనబడడం లేదా అని వారు అన్నారు. కేరళ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను వామపక్షవాదులు ప్రజాతంత్ర వాదులు మేధావులు ప్రతి ఒక్కరు ఖండించాలని వారు అన్నారు.



