- Advertisement -
నవతెలంగాణ తిరుపతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
- Advertisement -



