Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ సంస్కృతీ మణిమాలిక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతీ మణిమాలిక బతుకమ్మ

- Advertisement -

తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ సంస్కృతీ మణిమాలిక బతుకమ్మ అని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (ఎస్‌పీటీయూ) వీసీ నిత్యానందరావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని వర్సిటీ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలతో నిండిన బతుకమ్మను ఆరాధిస్తే జీవితంలో కొత్త ఆశలు, సంతోషాలు, విజయాలతో నిండుకుంటుందనే విశ్వాసానికి నిదర్శనమే ఈ బతుకమ్మ అని చెప్పారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ పూల పరిమళాలను వెదజల్లే బతుకమ్మ పల్లెల్లో భక్తిగీతాల సవ్వడితో మహిళల ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. వర్సిటీ ప్రాంగణంలో బతుకమ్మను అలంకరించి విద్యార్థులు, మహిళా ఉద్యోగులు ఆడిపాడి ఆనందంగా ఈ ఉత్సవంలో పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో లలితకళ పీఠం పీఠాధిపతి బి రాధ, దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ బిహెచ్‌ పద్మప్రియ, నృత్య శాఖాధిపతి రత్నశ్రీ, ఆర్థికాధికారి సుహాసిని, పరీక్షల నియంత్రణాధికారి ఎంవి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -