Monday, May 12, 2025
Homeతాజా వార్తలుతెలంగాణ ఎప్ సెట్-2025 ఫలితాలు విడుదల...

తెలంగాణ ఎప్ సెట్-2025 ఫలితాలు విడుదల…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఎప్‌సెట్) 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి అధికారులు ఫలితాల వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఈ ఏడాది బాలురు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదటి పది ర్యాంకులనూ వారే కైవసం చేసుకోవడం విశేషం. అంతేకాకుండా, ఇంజినీరింగ్‌లో తొలి మూడు అత్యున్నత స్థానాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు దక్కించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్ర ప్రథమ ర్యాంకు సాధించగా, నంద్యాల జిల్లా కోనాపురం నివాసి ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డి ద్వితీయ ర్యాంకు, విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్‌ తృతీయ ర్యాంకును కైవసం చేసుకున్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -