- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఎప్‌సెట్ (ఈఏపీసెట్) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మే 11న ఉదయం 11 గంటలకు TG EAPCET ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగాల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తంగా దాదాపు 3లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
- Advertisement -