Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు.. 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు.. 

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఇందలవాయి మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డికే రాజేశ్వర్, సిపిఐ  జిల్లా నాయకులు  సిహెచ్, సాయ గౌడ్, యువజన సంఘం జిల్లా నాయకులు ఎండి హుస్సేన్, పాల్గొని మాట్లాడారు ఆనాడు దొరల  భూస్వాముల  దోపిడి విధానాలకు  వ్యతిరేకంగా  నైజం పాలనకు,  వెట్టి  చాకిరి  విముక్తి కోసం  సాగించిన  తెలంగాణ సాయుధ  రైతన్న  తిరుగుబాటుకు  సెప్టెంబర్ 11 అన్నారు.

నాడు  పిలుపు నిచ్చిన మగ్దుం మైనోద్దీన్ , బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, నాయకత్వంలో సాగించిన తిరుగుబాటు తొ నైజాం  రజాకార్ల  దోపిడి గుండాలు  తోక ముడిచి యూనియన్  ప్రభుత్వం తొ లోపాయి కారి  ఒప్పందం చేసుకొని , ఇండియన్ యూనియన్  లో  విలీనం అయ్యాయన్నారు. అందుకోసమే సెప్టెంబర్ 17న రైతంగా తిరుగుబాటు దినంగా గుర్తించాలని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాట్లు పేర్కొన్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కులం, మతం, పేరుతో  భారతదేశా లౌకికవాదాన్ని  విచ్ఛిన్నం  చేస్తూ ఆదాని, అంబానీ, లకు భారతదేశ ఖనిజ  సంపదను అప్పజెప్పడానికి  గిరిజనులను చూపుతుందని, దోపిడి వర్గాలకు  వ్యతిరేకంగా  సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో  ఉద్యమాల్లో ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని, మత ఉన్మాదులను  ఎదుర్కోవాలంటే దేశంలోని  ఎర్రజెండాలన్నీ  ఒకటి కావాలన్నారు.ఈ కార్యక్రమంలో  మండల నాయకులు  రాంబాబు, సాయిలు, సెమినా,  మీనా ,లక్ష్మి రాజన్న, తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -