నవతెలంగాణ – చిన్నకోడూరు
తెలంగాణ రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం చిన్నకోడూరు మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రైతుల హక్కుల కోసం పోరాటాలను కొనసాగిస్తామన్నారు.
1936లో నెహ్రూ, సహజానంద సరస్వతి, పుచ్చలపల్లి సుందరయ్యల ఆధ్వర్యంలో వెట్టి చాకిరి, జమీందారీ వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఈ సంఘం ఆవిర్భవించిందన్నారు. జెండాను ఆవిష్కరించి నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కోరమైన రాజు, దశరథం, శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, సిహెచ్ సంజీవరెడ్డి, కొండల్, బాల్ రెడ్డి, రాపోల్ రాజు, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



