నవతెలంగాణ – గాంధారి
తెలంగాణ రైతు సంఘం రెండవ మహాసభను ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాంధారి మండల తెలంగాణ రైతు సంఘం అధ్యక్షునిగా ఉప్పల సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా గైని సాయిలు, ఉపాధ్యక్షులుగా దుర్గం సాయిలు, సహ కార్యదర్శిగా బలరాం నాయక్,కమిటీ సభ్యులుగా లక్ష్మణ్ నాయక్, వినోద్, సాబురాం, రోజా ,లక్ష్మి ,వసంతరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మౌతిరాం నాయక్ మాట్లాడుతూరైతు సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని సాగు భూముల కోసం పోడు భూముల కోసం పోడు భూమి పట్టకు రుణం ఇవ్వాలని పోరాటాలు నిర్వహించి సాధించుకున్నామని అన్నారు.
మాతు సంఘం భూ పోరాటం మూడేళ్ల కాలం పాటు కొనసాగిస్తుందని అన్నారు ఆ విజయం సాధించటం ఎంతో దూరం లేదని దానికోసం ఎన్ని రకాల పోరాట గల సిద్ధపడతామని అన్నారు. అట్లాగే మండలంలో సాగునీరు తాగునీరు అధిక ధరల మీద పోరాటాలు జరిగినావని అన్నారు రైతుల కోసం గిట్టుబాటు ధరలు కావాలని రైస్ మిల్లర్ల దోపిడీ అరికట్టాలని దశలవారీగా పోరాటాలు నిర్వహించామని దళారుల దోపిడిని అడ్డుకట్ట వేయగలిగామని అన్నారు. రాబోయే కాలంలో మండలంలో సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు సృష్టించి పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ బడుగు బలహీన వర్గాలు పీడిత ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.
తెలంగాణ రైతు సంఘం రెండవ మహాసభ నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



