Tuesday, February 10, 2026
E-PAPER
Homeఖమ్మంబీబీసీ కింద పంటలను కాపాడాలంటూ తెలంగాణ రైతులు ఆందోళన 

బీబీసీ కింద పంటలను కాపాడాలంటూ తెలంగాణ రైతులు ఆందోళన 

- Advertisement -

దామలూరు కింద పంటలను కాపాడాలంటూ ఆంధ్ర రైతులు ఆందోళన 
తెలంగాణ రైతులు 3 గంటల పాటు..
ఆంధ్ర రైతులు 2 గంటల పాటు ఆందోళన
ఖమ్మం సీఈవో రమేష్ బాబు హామీతో ఆందోళన విరమణ 
బోనకల్ సబ్ డివిజన్ డి ఈ పై నిప్పులు కక్కిన ఆంధ్ర రైతులు 
నవతెలంగాణ – బోనకల్

ఖమ్మం జిల్లా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ బ్రాంచ్ కెనాల్ కింద సాగుచేసిన సుమారు 3000 ఎకరాలలో మొక్కజొన్న పంట ఎండిపోతుందని బోనకల్ మండల పరిధిలోనే మోటమర్రి, గోవిందాపురం ఏ, మధిర మండల పరిధిలోనే అల్లినగరం, మడుపల్లి, దేశినేని పాలెం గ్రామాలకు చెందిన అన్నదాతలు వైరా జగన్ పేట ప్రధాన రహదారిపై ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా బోనకల్ సబ్ డివిజన్ డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు తమకు ఉద్దేశపూర్వకంగానే దాములూరు మేజర్ కు సాగర్ నీటిని విడుదల చేయటం లేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వత్సవాయి, పోలంపల్లి, ఖమ్మంపాడు, వేముల నర్వ, వేములగడ్డ తదితర గ్రామాలకు చెందిన సుమారు 100 మంది రైతుల వరకు వైరా – జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. చివరకు ఖమ్మం సీఈవో రమేష్ బాబు ఆందోళనతో రైతులు తమ ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

బోనకల్ మండల పరిధిలోని మోటమర్రి, గోవిందాపురం ఏ, మధిర మండల పరిధిలోని మడుపల్లి, అల్లినగరం, గ్రామాలకు చెందిన రైతులు బోనకల్ బ్రాంచ్ కెనాల్ కేంద్ర సాగుచేసిన తమ పంటలు ఎండిపోతున్నాయని వైరా జగ్గయ్యపేట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఆ కొద్దిసేపటికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తమకు ఉద్దేశపూర్వకంగానే దాములూరు మేజర్ కు సాగర్ నీటిని విడుదల చేయడం లేదని పెద్ద ఎత్తున వారి సరిహద్దు ప్రాంతంలో ఆందోళనకు దిగారు. ఓ గంట తర్వాత ఆంధ్ర ప్రాంత రైతులు ఆందోళనతో వత్సవాయిస్ ఎస్సై పి ఉమా మహేష్, జగ్గయ్యపేట ఎన్ఎస్పి డిఈ చంద్రశేఖర్, ఏ ఈ ప్రసన్నలక్ష్మి హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

రైతులు వడ్లమూడి రాంబాబు, వత్సవాయి సాగునీటి డిసి అధ్యక్షుడు చిట్టూరి సుభాష్, రైతు సంఘం ఎన్టీఆర్ జిల్లా నాయకులు చిరుమామిళ్ల హనుమంతురావు, మండేపూడి చంద్రశేఖర రావు సిపిఎం మండల కార్యదర్శి బొడ్డు రాము తో వారు చర్చలు జరిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారికి రైతుల స్పష్టం చేశారు. డి ఈ చంద్రశేఖర్ బోనకల్ సబ్ డివిజన్ డి ఈ తమ్మారపు వెంకటేశ్వర్లు కు, కల్లూరు ఎస్ ఈ వాసంతి కి ఫోన్లో రైతుల సమస్యను వివరించారు. అయితే వాసంతి నివ్వెర పోయే సమాధానం చెప్పింది. తాము దాములూరి మేజర్ కు నీటిని విడుదల చేయమని పదేపదే బోనకల్ డి ఈ తమ్మారపు వెంకటేశ్వర్లకు చెబుతున్న తమ మాటను లెక్కచేయడం లేదని సమాధానం చెప్పింది. దీంతో రైతుల మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనకల్ సబ్ డివిజన్ డి ఈ తమ్మారపు వెంకటేశ్వర్లు తాము ఆంధ్ర ప్రాంతం రైతులం కావడం వల్లే ఉద్దేశపూర్వకంగానే దాములూరు మేజర్ కు నీటిని విడుదల చేయడం లేదని, తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ఎస్ ఈ తో ఫోన్లో మాట్లాడారు.

దీంతో ఆయన ఖమ్మం సీఈఓ తో మాట్లాడి సాగర్ నీటిని వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఆందోళన విరమించాలని రైతులను కోరడంతో అందుకు రైతుల కూడా అంగీకరించారు. వత్సవాయి ఎస్ఐ ఉమా మహేష్ కృషితో రైతులు తమ ఆందోళన విరమించారు. కానీ తెలంగాణ రైతుల మాత్రం అప్పటికే రెండు గంటలపాటు ఆందోళన చేసిన బోనకల్ సబ్ డివిజన్ డి ఈ గాని, మరి ఎవరు సంఘటన స్థలానికి రాలేదు. చివరకు ఆంధ్ర రైతులు ఆందోళన విరమించిన తర్వాత తెలంగాణ రైతులకు ఆంధ్ర రైతులు మద్దతుగా నిలిచారు. తెలంగాణ రైతుల ఆందోళన విషయాన్ని ఖమ్మం ఈ ఈ మధు, ఎస్ ఈ లు వాసంతి, వెంకటేశ్వర్లు దృష్టికి ఫోన్లో ఆంధ్ర రైతులు వివరించారు.

అయితే వీరి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. తాము 3000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేసామని 15 రోజుల నుంచి సాగర్ నీరు రాక ఎండిపోతున్నాయని తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని ఆ అధికారులకు అల్లినగరం గ్రామానికి చెందిన రైతు శాఖమూరి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. బోనకల్ ఎస్సై పొదిలి వెంకన్న రైతులతో ఫోన్లో మాట్లాడారు. అయినా రైతులు తమకు స్పష్టమైన హామీ కావాలంటూ పట్టుపట్టారు. సుమారు రెండున్నర గంటల పాటు రైతులు ఆందోళన కొనసాగుతున్న నీటిపారుదల శాఖ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అల్లినగరం గ్రామానికి చెందిన శాఖమూరి కోటేశ్వరరావు అనే రైతు పురుగుమందు డబ్బా తీసుకువచ్చి పురుగుమందు తాగే ప్రయత్నం చేయగా సహచర రైతులు వారించారు. మండుటెండలో పంటల కాపాడాలని తాము ఆందోళన చేస్తుంటే అధికారులు పట్టించుకోరా అంటూ ఆయన తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురయ్యారు.

అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శాఖమూరి కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా సంఘటన స్థలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర, తెలంగాణ రైతులు కోటేశ్వరరావుని వారించి చివరగా ఖమ్మం సీఈవో రమేష్ బాబుకి ఫోన్లో పరిస్థితి విషమించిందని, రైతుల పురుగుమందు తాగి ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్నారని స్పష్టమైన హామీ రైతులకు ఇవ్వాలని ఫోన్లో సమస్యను రమేష్ బాబుకు వివరించారు. దీంతో సీఈఓ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, పరిస్థితి చేయు దాటిపోతుండటంతో తాను వెంటనే బోనకల్ బ్రాంచ్ కెనాల్ కు 1300 క్యూసెక్కుల నీటిని సాయంత్రం కల్లా విడుదల చేయిస్తానని రైతుల తమ ఆందోళన విరమించాలని కోరారు.

రైతుల పంటలు పూర్తిగా తడిసే వరకు నీటిని కొనసాగిస్తామని ఆయన రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ అన్నదాతలు తమ ఆందోళన విరమించారు. ఈ విధంగా తెలంగాణ రైతులు ఆందోళన 10:00 గంటల నుంచి ఒంటిగంట వరకు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ ఆందోళన ఫలితంగా వత్సవాయి వరకు సుమారు రెండు కిలోమీటర్లు, బోనకల్ వైపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -