No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలుకేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే తెలంగాణ రైతాంగానికి తీవ్రనష్టం : సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణశాసనంగా మారాయని ఆయన ఆరోపించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. “బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు.

ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. తుంగభద్ర, కృష్ణా జలాలు మొదట గద్వాలలోని జూరాలకు వస్తాయని, అక్కడే పాలమూరు-రంగారెడ్డి, నల్గొండ ప్రాజెక్టులకు నీటిని తరలించి ఉంటే ఏపీ జలాలను కొల్లగొట్టే అవకాశం ఉండేది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా పరివాహక ప్రాంత రైతులు నష్టపోయారని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad