Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల పిఏసిఎస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

తాడిచెర్ల పిఏసిఎస్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రమైన తాడిచెర్ల లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఆదివారం పిఏసిఎస్  చైర్మన్ ఇప్ప మొండయ్య జాతీయ పథకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ హృదయపూర్వక నిరాజనం అర్పిస్తూ వారి సంకల్పం, ధైర్యం ,తెలంగాణ ప్రజలకు చిరస్థాయి స్ఫూర్తి, ఐక్యత, సమృద్ధి ప్రగతితో రాష్ట్రం శిఖరాలను అధిరోహించాలని సుసంపన్న భవిష్యత్తు కోసం కలిసి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ మల్కా సూర్య ప్రకాష్ రావు డైరెక్టర్లు వోన్న తిరుపతిరావు ,మాచర్ల సురేష్, కో ఆప్షన్ నెంబర్స్ మేకల రాజయ్య ,మెరుగు రాజయ్య , తహసీల్దార్ రవి కుమార్, ఎంపిడిఓ,శ్రీనివాస్,వివిధ పార్టీల నాయకులు, రైతులు, పిఎసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad